- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలర్ ఎగరేయట్లేదు.. గట్టిగా అరవట్లేదు.. సైలెంట్ స్టేట్‌మెంట్ ఇచ్చిన అక్కినేని అఖిల్
'లెనిన్'లాంటి మరిన్ని విజయాలను ప్రేక్షకులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని అఖిల్ చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం 'లెనిన్'. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం 'లెనిన్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్' పేరుతో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అఖిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అఖిల్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లోనే 'లెనిన్' అతి పెద్ద విజయం. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ సినిమా విజయం సాధించిందని నేను కాలర్ ఎగరేయడం లేదు.. గట్టిగా అరవడం లేదు. నేను ఎప్పటిలాగే సైలెంట్‌గా నా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఇకపై కూడా ఇలాంటి మంచి విజయాలు అందించేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే "జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక్క ఫోన్ చేయగానే మా సినిమా కోసం వాయిస్ ఓవర్ చెప్పడానికి వెంటనే అంగీకరించారు. ఆయన వాయిస్‌తో సినిమా ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రేక్షకులను మొదటి నుంచే కథలోకి తీసుకెళ్లడంలో ఆయన వాయిస్ ఓవర్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా విజయంలో ఎన్టీఆర్ గారి సహకారం కూడా ఎంతో ముఖ్యమైనది" అని అఖిల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






