కట్ డ్రాయర్‌లో విజయ్ కటౌట్.. మీమర్స్ రెచ్చిపోయారుగా

by Disha Web Desk |
కట్ డ్రాయర్‌లో విజయ్ కటౌట్.. మీమర్స్ రెచ్చిపోయారుగా
X

దిశ, సినిమా : లైగర్ ట్రైలర్ లాంచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సెలబ్రేషన్స్ మొదలెట్టారు. సుదర్శన్ థియేటర్‌లో VD 75 ఫీట్ కటౌట్‌ ఏర్పాటు చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మీమర్స్ తమ పని తాము చేస్తున్నారు. 'ట్రైలర్ లాంచ్‌కే అండర్‌వేర్ కటౌట్ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్.. మూవీ రిలీజ్ అప్పుడు ఎలాంటి కటౌట్ పెడతారో' అంటూ సెటైర్స్ వేస్తున్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. 'ఇంకేముంది విజయ్ న్యూడ్ ఫొటో ఉందిగా' అని కొందరంటే, 'ఇది కటౌట్‌లా లేదు కట్ డ్రాయర్ యాడ్‌లా ఉంది' అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Next Story