- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవితకు బిగ్ షాక్... ఎన్నికల సంఘానికి లేఖ
తెలంగాణ రాజకీయాల్లో TRS పేరు చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన వివాదం నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో TRS పేరు చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన వివాదం నడుస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీకి 'TRS' అనే పేరును కేటాయించవద్దని కోరుతూ తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాయడం చర్చనీయాంశమైంది. TRS పేరుతొ తమ పార్టీ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉందని, ఈ పేరుపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
బాలరంగం తన లేఖలో.. తమ 'తెలంగాణ రాజ్య సమితి'ని ఎన్నికల సంఘం 2023లోనే రిజిస్టర్ చేసిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో 'గ్యాస్ సిలిండర్' గుర్తుపై పది నియోజకవర్గాల్లో పోటీ చేశామని ఆయన గుర్తు చేశారు. కవిత స్థాపించే పార్టీ పూర్తి పేరు ఏదైనప్పటికీ, ఆమె కేవలం 'TRS' అనే అబ్రివేషన్‌తోనే ప్రచారం చేస్తారని, దీనివల్ల ఓటర్లలో గందరగోళం ఏర్పడి తమ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల, కవిత గారి కొత్త పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ను అడ్డుకోవాలని, ఆ పేరుకు అనుమతి ఇవ్వవద్దని బాలరంగం ఈసీని విజ్ఞప్తి చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)గా మార్చాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ సాంకేతిక కారణాలతో అది సాధ్యపడలేదు. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన తరుణంలో 'తెలంగాణ రాజ్య సమితి' రూపంలో ఎదురైన ఈ కొత్త అభ్యంతరంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. అలాగే ఇటీవలే వైభవంగా కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవితకు కూడా ఇది బిగ్ షాకింగ్ అని చెప్పవచ్చు.






