మెరుగైన వైద్యం కోసం రూ.1.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత

by Ratna Kumari |

నాంపల్లి మండలం రేవెల్లి గ్రామానికి చెందిన వంగూరి చిన్న వెంకటయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మెరుగైన వైద్యం కోసం రూ.1.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత
X

నల్గొండ టౌన్ : నాంపల్లి మండలం రేవెల్లి గ్రామానికి చెందిన వంగూరి చిన్న వెంకటయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) మంజూరు చేయించి, మంగళవారం నల్గొండలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story