- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బజార్ హత్నూర్ డెడ్రా అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
బజార్ హత్నూర్ మండలంలోని మారుమూల గ్రామమైన డెడ్రా గ్రామ సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

దిశ, బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండలంలోని మారుమూల గ్రామమైన డెడ్రా గ్రామ సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చిరుత కదలికలను గుర్తించినట్లు ఎఫ్‌ఎస్‌ఓ ప్రవీణ్ మహాజన్ వెల్లడించారు. ఇటీవల డెడ్రా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఆవుపై చిరుత దాడి చేసి చంపినట్లు సమాచారం. గ్రామస్తుల సమాచారం మేరకు గురువారం అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆవు కళేబరాన్ని పరిశీలించారు. దాడి జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించి ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా డెడ్రా గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అడవి ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని, చిరుత కనిపించినా లేదా అనుమానాస్పద కదలికలను గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో చిరుత సంచారం నమోదైన నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు.






