ఆ స్టార్ హీరో రీఎంట్రీ.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by Yarlagadda Naga Rani |
ఆ స్టార్ హీరో రీఎంట్రీ.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : 80, 90 వ దశకంలో తమిళ ఇండస్ట్రీని ఏలిన లెజెండరీ యాక్షన్ హీరో విజయ్‌కాంత్.. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత నటనకు స్వస్తి పలికారు. ఇక కొంతకాలం నుంచి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన ఇప్పటికీ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. అయితే, ఇటీవల కాస్త కోలుకున్నట్లు తెలుస్తుండగా.. మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న 'మళ్ళీ ఇష్టపడని మనిషి' చిత్రంలో విజయ్‌కాంత్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు టాక్. ఈ మేరకు దర్శకుడు ప్రయత్నాలు మొదలు పెట్టగా.. పూర్తిగా కోలుకున్నాక నటిస్తారని కుటుంబ సభ్యులు హామీ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.



Next Story

Most Viewed