Raghava Lawrence: లారెన్స్ బర్త్ డే సర్‌ప్రైజ్.. ‘కాల భైరవ’ మూవీ నుంచి పవర్ ఫుల్ లుక్ రిలీజ్

by Mallepaka Hamsa |   (  Updated:2024-11-03 14:20:42  IST  )

డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు, హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) అందరికీ సుపరిచితమే.

Raghava Lawrence: లారెన్స్ బర్త్ డే సర్‌ప్రైజ్.. ‘కాల భైరవ’ మూవీ నుంచి పవర్ ఫుల్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు, హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) అందరికీ సుపరిచితమే. ఆయన తెలుగులో ‘కాంచన’(Kanchana) శివలింగ వంటి హారర్ చిత్రాలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కాల భైరవ’(Kaala Bhairava) మూవీకి సంబంధించిన పవర్ ఫుల్ లుక్‌(powerful look)ను మేకర్స్ విడుదల చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అలాగే లారెన్స్ కూడా ఇన్‌స్టా వేదికగా షేర్ చేసి ఆశీర్వాదాలు కావాలని క్యాప్షన్ జత చేశారు. అయితే దీనికి రమేష్ వర్మ(Ramesh Verma) పెన్‌మెట్సా దర్శకత్వం వహిస్తుండగా.. ఏ స్టూడియోస్ లిమిటెడ్, హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై మనీష్ షా(Manish Shah), కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా లారెన్స్(Lawrence) 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రజెంట్ లారెన్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన ఫ్యాన్స్ అదుర్స్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ‘కాల భైరవ’(Kaala Bhairava) సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వచ్చే ఏడాది థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు సమాచారం. కాగా, ప్రజెంట్ రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటిస్తున్న మూవీ ‘కాంచన-4’. దీని కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click Here For Twitter Post..


Next Story