- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ జెండా గద్దెను ధ్వంసం చేసిన సర్పంచ్ (వీడియో)
దిశ, జఫర్‌గడ్: మండలంలోని ఓగులాపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో...Latest News about Vogulapur Village Sarpanch

X
దిశ, జఫర్‌గడ్: మండలంలోని ఓగులాపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న జాతీయ జెండా గద్దెను స్థానిక సర్పంచ్ నీరజారెడ్డి శనివారం ధ్వంసం చేశారు. ఆగస్టు 15న 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జాతీయ జెండా గద్దె నిర్మాణం చేపట్టారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ నూతనంగా నిర్మిస్తున్న జాతీయ జెండా గద్దె వద్దకు చేరుకుని ఇక్కడ ఎందుకు నిర్మాణం చేపట్టారని కూల్చివేశారు. జెండా గద్దె ధ్వంసం చేసిన సర్పంచ్ నీరజ రెడ్డిపై గౌడ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






