దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి కన్నుమూత

by Muthe.Rajitha |

దివంగత ప్రముఖ నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి గురువారం చెన్నైలో కన్నుమూశారు.

దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సోగ్గాడు'గా ప్రసిద్ధి చెందిన దివంగత ప్రముఖ నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి గురువారం చెన్నైలో కన్నుమూశారు. 96 ఏళ్ల శాంతకుమారి గత కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శాంతకుమారిని గురువారం పరామర్శించడానికి ఆమె ఆప్తమిత్రురాలు ఒకరు వచ్చారు. ఆ స్నేహితురాలితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న సమయలోనే అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురై తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

నేడే అంత్యక్రియలు.. సినీ లోకం నివాళులు

శాంతకుమారి పార్థివ దేహాన్ని చెన్నైలోని వారి నివాసానికి తరలించారు. ఆమె భౌతికకాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. తెలుగు చిత్రసీమలో క్రమశిక్షణకు, ఆదర్శవంతమైన జీవితానికి మారుపేరుగా నిలిచిన శోభన్‌బాబు-శాంతకుమారి దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శాంతకుమారి మరణవార్త తెలియగానే టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story