- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ మోసం.. రూ.14.45 లక్షలు స్వాహా!
ఆదిలాబాద్‌లో నకిలీ పత్రాలతో భూమి మోసానికి పాల్పడిన వ్యక్తిపై మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ బి.డి.ప్రేమ్ కుమార్ తెలిపారు.

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో నకిలీ పత్రాలతో భూమి మోసానికి పాల్పడిన వ్యక్తిపై మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ బి.డి.ప్రేమ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మల్లంగి గ్రామానికి చెందిన ధరావత్ ప్రవీణ్ నాయక్, మావల జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలం తక్కువ ధరకు వస్తుందని ఆదిలాబాద్‌కు చెందిన పాట్కూరి సత్యనారాయణను నమ్మించాడు. ఇద్దరి పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి బ్యాంకు ఖాతాల ద్వారా రూ.14.45 లక్షలు తీసుకున్నాడు.
అనంతరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ పత్రాలు సృష్టించి, లేని భూమిని ఉన్నట్టుగా చూపించి మోసానికి పాల్పడినట్లు బాధితులు శనివారం ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ తెలిపారు. ఆర్థిక లావాదేవీల సమయంలో పూర్తి వివరాలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని, మోసపూరిత ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సీఐ ప్రేమ్ కుమార్ సూచించారు. ఇలాంటి మోసాలకు గురైన బాధితులు నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు.






