ఈ స్టోరీ నా కోసం రాయలేదు.. ‘మా ఇంటిబంగారం’ చిత్రంపై సమంత షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

స్టార్ నటి సమంత తన సొంత బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’.

ఈ స్టోరీ నా కోసం రాయలేదు.. ‘మా ఇంటిబంగారం’ చిత్రంపై సమంత షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ నటి సమంత తన సొంత బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. పలు వాయిదాల తర్వాత భారీ అంచనాల మధ్య ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ జూన్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన సమంత ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ‘నిజానికి ఈ సినిమాను నేను ఎంపిక చేసుకోలేదు. ఈ మూవీనే నన్ను ఎంపిక చేసుకుంది. ఈ చిత్రాన్ని ఫీమేల్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కించాలి అనుకున్నప్పుడే ఇందులో సాయి పల్లవిని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ తను చాలా బిజీగా ఉండటం, డేట్స్ కుదరకపోవడంతో మేకర్స్ ఈ సినిమా స్టోరీని నాకు తగ్గట్టుగా మార్చారు. చాలా హోప్‌తో ఈ మూవీలో నటించాను. అంతే కాదు.. ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ చూసి చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ ఇన్స్‌పయర్ అవుతారు. త్వరలోనే వారు కూడా ఇలాంటి చిత్రాల్లో నటించాలని అనుకుంటారు. మా ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న రాబోతున్నది.. థియేటర్స్‌లో కలుద్దాం’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story