Mumaith Khan: ఆ టైమ్‌లో పిట్స్ కూడా వచ్చేవి.. తన పరిస్థితిపై నటి ఎమోషనల్

by Chukka Sudharani |

ఐటెమ్స్ సాంగ్స్‌తో ఒకప్పుడు యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న నటి ముమైత్ ఖాన్.. తన లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Mumaith Khan: ఆ టైమ్‌లో పిట్స్ కూడా వచ్చేవి.. తన పరిస్థితిపై నటి ఎమోషనల్
X

దిశ, సినిమా: ఐటెమ్స్ సాంగ్స్‌తో ఒకప్పుడు యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న నటి ముమైత్ ఖాన్.. తన లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘నాకు గతంలో బ్రెయిన్ నర్వ్ బరస్ట్ అయింది. దాంతో నా తలలో తొమ్మిది టైటానియం వైర్లను అమర్చాల్సి వచ్చింది. ఆ సర్జరీ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉండేది. తరచూ ఫిట్స్ రావడం, తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి లాంటి వచ్చేవి. ఈ హెల్త్ కండిషన్, వాడుతున్న హెవీ మెడికేషన్ కారణంగా నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే నేను కావాలని ఎక్కువగా ఆలోచించడం కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లలేదు. ఈ మందుల ప్రభావం నన్ను డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేశాయి. ఒకనొక టైమ్‌లో అయితే ఏం చెయ్యాలో కూడా అర్థం కాక చాలా మానసిక వేదన అనుభవించేదాన్ని. అప్పుడు నా మైండ్‌ను నేనే కంట్రోల్స్ చేసుకునేదాన్ని. అప్పుడు నా లైఫ్‌లో నేను సాధించిన సక్సెస్, అచీవ్మెంట్స్ అన్నీ గుర్తు చేసుకునేదాన్ని. వాటి ముందుకు ఈ డిప్రెషన్ అనేది చాలా చిన్నది, కేవలం తాత్కాలికం అని నాకు నేను సర్థిచెప్పుకునేదాన్ని’ అంటూ తన లైఫ్ జర్నీని ప్రేక్షకులతో పంచుకుంది ముమైత్.

Next Story