హ‌రీష్ రావు, కేటీఆర్, కవిత.. ముగ్గురికీ సీఎం కావాలని ఉంది: అద్దంకి ద‌యాక‌ర్

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ పార్టీ క‌నుమ‌రుగు అవుతోందని, సొంత ఇంట్లో నుంచి క‌విత బ‌య‌ట‌కు వెళ్లి పార్టీ పెట్టుకుని సీఎం అవుతానని చెప్పుకుంటోందని, హ‌రీష్ రావు బీజేపీ వైపు చూస్తున్నాడు, సీఎం కావాల‌ని ఆయ‌న‌కు కూడా ఉందని శాసన మండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ ఆరోపించారు.

హ‌రీష్ రావు, కేటీఆర్, కవిత.. ముగ్గురికీ సీఎం కావాలని ఉంది: అద్దంకి ద‌యాక‌ర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ క‌నుమ‌రుగు అవుతోందని, సొంత ఇంట్లో నుంచి క‌విత బ‌య‌ట‌కు వెళ్లి పార్టీ పెట్టుకుని సీఎం అవుతానని చెప్పుకుంటోందని, హ‌రీష్ రావు బీజేపీ వైపు చూస్తున్నాడు, సీఎం కావాల‌ని ఆయ‌న‌కు కూడా ఉందని శాసన మండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ ఆరోపించారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ కూడా సీఎం అని త‌న అనుచ‌రుల‌తో అనిపించుకుంటున్నారని, మ‌ళ్లీ కాంగ్రెస్ ఉండాలి రేవంత్ రెడ్డి మ‌ళ్లీ సీఎం కావాల‌ని ప్రజ‌లు కోర‌కుంటున్నారని ఆయన తెలిపారు. నెక్ట్స్ సీఎం తానే అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం చేయించుకుంటున్నారని, కేసీఆర్ కుటుంబ ప్యూడ‌ల్ మ‌న‌స్థతత్వాన్ని ఆయన గ‌మ‌నించాలని, ఎప్పటికైనా బీఆర్ఎస్ లో నాయ‌కులు క‌ల్వకుంట్ల కుటుంబ‌మే అని అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ ను గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సార్లు పొగిడారని, బీజేపీతో క‌ల‌వ‌డానికి చంద్రబాబు ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్లనే ఆయ‌నను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోందని అద్దంకి దయాకర్ ఆరోపించారు.

చంద్రబాబును రేవంత్ రెడ్డికి అంట‌గ‌ట్టాల‌ని చూస్తే ఉపయోగం లేదని, చంద్రబాబు మొద‌టి శిష్యుడు కేసీఆర్ అని, గ‌తంలో కేసీఆర్ ను మ‌హబూబ్ న‌గ‌ర్ ఎంపీగా గెలిపించింది రేవంత్ రెడ్డినే అని ఆయన గుర్తు చేశారు. న‌లుగురు ద‌ళితుల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన రేవంత్ రెడ్డి ద‌ళితుల‌ను అవ‌మానిస్తే న‌మ్ముతారా? కాంగ్రెస్ సీనియ‌ర్లు అంద‌రూ సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో క‌లిసి ప‌నిచేస్తున్నారని అద్దంకి దయాకర్ చెప్పారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుని జూరాల ను సోర్స్ పాయింట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చ‌ర్చ కావాలంటే బీఆర్ఎస్ వాళ్లు కేసీఆర్ ను తీసుకురావాలి, రేవంత్ రెడ్డిని బ‌హిరంగ‌చ‌ర్చకు తాము తీసుకువ‌స్తామన్నారు. కేసీఆర్ ను తీసుకువ‌చ్చే స‌త్తా ఉంటే ఎక్కడైనా చ‌ర్చకు తాము సిద్దమని అద్దంకి సవాల్ విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డి స‌భ‌లు పెడితే బీఆర్ఎస్ కు ఇబ్బంది ఏమిటని, కేసీఆర్ హ‌యాంలో ఏ స్థాయిలో ఖ‌ర్చు పెట్టి బ‌హిరంగ స‌భ‌లు పెట్టారో, ఆయ‌న స‌భ‌ల్లో జ‌నాన్ని ఎలా తిట్టారో కూడా తెలుసని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కేసీఆర్ హాయంలో చేసిన అప్పుల‌కు వడ్డీలు క‌ట్టడానికి ప్రభుత్వానికి స‌రిపోతుందని, ఇవి చెప్పుకోడానికి మోహం లేకనే కేసీఆర్ బ‌య‌ట‌కు రాకుండా ఫామ్ హౌస్ లో ప‌డుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతిప‌క్ష నేత కేసీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో జీతం తీసుకుంటున్నారని, కేసీఆర్ ఆస్థాయిలో పనిచేస్తున్నారా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. సింగ‌రేణిలో బొగ్గునిల్వల పైన హ‌రీష్ రావు త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ హ‌యాంలో సింగ‌రేణి కార్మికుల‌ను అణిచివేశారు, ప‌ద‌వి పోగానే బీఆర్ఎస్ నాయ‌కుల‌కు ఆర్టీసీ, సింగ‌రేణి, కాళేశ్వరం గుర్తుకు వ‌స్తున్నాయని అద్దంకి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పేరును మ‌రొక‌రు తీసుకోకుండా క‌విత పార్టీ పెట్టుకున్నట్లుందని, ఆమె కూడా ఆ తాను ముక్కనే అన్నట్లుగా వ్యవహరిస్తోందని అద్దంకి దయాకర్ ఆరోపించారు. సీఎంకి హెలికాఫ్టర్ ఎందుకు అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారని, బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్ తో పాటు సీఎంఓ అధికారులు కూడా హ‌లికాఫ్టర్లు వాడారని అద్దంకి విమర్శించారు. రేవంత్ రెడ్డి త‌న భ‌ద్రత‌ను కూడా ప‌క్కన పెట్టారని, మూడు వెహికిల్స్ కాన్వాయ్ లో సీఎం ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు. సామాన్య వ్యక్తిలా హైద‌రాబాద్ రోడ్లపైన సీఎం ప్రయాణం చేస్తున్నారన్నారు.

Next Story