- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుణాచలంలో లడ్డు ప్రసాదం నిలిపివేత
LPG కొరత వలన అరుణాచలం పుణ్యక్షేత్రంలో లడ్డూ ప్రసాద తయారీని నిలిపివేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా, సామాన్యుడి దైనందిన జీవితాన్ని, చివరకు ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్వహణను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో అంతర్జాతీయ చమురు, సహజ వాయువు (LPG/LNG) సరఫరాఆగిపోయింది. దీంతో దేశంలో తీవ్ర LPG కొరత ఏర్పడింది. తాజాగా దీని ప్రత్యక్ష ప్రభావం తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంపై పడటం గమనార్హం. గత మూడేళ్లుగా భక్తులకు ఉచితంగా అందజేస్తున్న లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, ఆలయ అధికారులు ప్రసాద తయారీని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
అయితే భక్తుల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. గ్యాస్ పొయ్యికి బదులుగా 'కట్టెల పొయ్యి'పై లడ్డూలు, మురుకులు, అతిరసలు తయారు చేయాలని ఆలయ యంత్రాంగం ఆలోచిస్తోంది. ప్రభుత్వ అనుమతి రాగానే కట్టెల పొయ్యిపై ప్రసాదాల తయారీ మొదలు పెడతామని ఆలయ నిర్బహకులు పేర్కొన్నారు.






