- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుకింగ్ గ్యాస్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన
కుకింగ్ గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరి చందన హామీ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కుకింగ్ గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను నెల రోజులలోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరి చందన హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సలహాదారు కమిటీ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు, కమిటీ నాయకులు చామకూర రాజు, అధ్యక్షులు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శులు అజయ్ రెడ్డి సచివాలయంలో ఆమె కలిసి ఎల్పీజీ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. కార్మికుల సమస్యలపై స్పందించి డిస్ట్రిబ్యూటర్లకు కార్మిక శాఖ తరపున నోటీసులు పంపిస్తామని డిస్ట్రిబ్యూటర్లతో డిస్ట్రిబ్యూటర్లతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా గౌరవ సలహా దారు కమిటీ చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్లు సరఫరా చేసే కార్మికులకు కనీస జీతాలు చెల్లించడం లేదని చెప్పారు. ఈ ఎస్ఐ ,పిఎఫ్ లు ఇవ్వడం లేదంటూ పలు అంశాలు హరిచందన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 806 గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషనర్లు ఉన్నారని వారు కార్మిక శాఖ ఇతర ప్రభుత్వ శాఖనియమాలను పాటించ కుండా కార్మికుల శ్రమదోపిడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులు అపాయింట్మెంట్లెటర్ కూడా కనీసం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.కార్మికులకు వివిధమైన ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా తొలగిస్తున్నారని వారాంతపు సెలవులు కూడా ఇవ్వడం లేదని అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
- Tags
- IAS Harichandana






