వైజాగ్ బీచ్‌లో సమంత, విజయ్.. 'ఖుషి' కోసమే!

by Disha Web |
వైజాగ్ బీచ్‌లో సమంత, విజయ్.. ఖుషి కోసమే!
X

దిశ, సినిమా: శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకక్కుతున్న చిత్రం 'ఖుషి'.విజయ్ దేవరకొండ, నటి సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక షూటింగ్ షెడ్యూల్‌ను ఇటీవలే కశ్మీర్‌లో పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్న ఈ మూవీ టీమ్.. వైజాగ్‌ సముద్ర తీరాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించనుంది. మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, జయరామ్, సచిన్ , వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 23న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Next Story

Most Viewed