- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయం అడిగితే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి వెనుకటి రోజులు తెస్తానని.. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్‌సీ(PRC) ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదాన్నీ అమలు చేయకుండా విజయవంతంగా తెలంగాణ ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
తాజాగా నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని, వారు చేస్తున్న ఆందోళనను గౌరవించి వారిని పిలుచుకొని ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని, తూతూ మంత్రంగా కేవలం మీడియా హెడ్‌లైన్ల కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌పై దృష్టి సారించి దాన్ని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరుసగా దిల్‌సుఖ్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌తో పాటు అనేక చోట్ల విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.
కేటీఆర్ ఎద్దేవా
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బట్టల షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన రేవంత్ రెడ్డి పక్కనే గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమైన గాంధీనగర్‌కు పోలేకపోయారని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అవి మావయ్య అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని.. కానీ ఆ అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి రైతులను, రైతు కూలీలను, కౌలుదారులను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ప్రభుత్వ ఉద్యోగులను ఇలా అందరినీ మోసం చేశారని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయమని అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి తనకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు రావు కానీ ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హామీలను అమలు చేయమన్నందుకు ప్రతిపక్షాలను, ప్రజలను, ప్రతి ఒక్కరినీ బూతులతో తిడుతున్నారని అన్నారు.






