- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేగంపేట రామానంద తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్!
తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ లతో కలిసి ప్రారంభించారు.

దిశ, బేగంపేట: తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. గురువారం బేగంపేటలోని రామానంద తీర్థ స్కూల్ లో సీల్ వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్ ను కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీల్ వెల్ సంస్థ అధినేత సుబ్బారావును కేటీఆర్ సన్మానించి అభినందించారు.
అనంతరం స్కూల్లోని 240 మంది విద్యార్థులకు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని వడ్డించడం పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కేటీఆర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, మాజీ కార్పొరేటర్‌లు టీ.మహేశ్వరి, నామన శేషుకుమారి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, నాయకులు శ్రీహరి, నరేందర్, ప్రవీణ్ రెడ్డి, కిషోర్, నాగులు, శేఖర్, ఆరీఫ్, ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






