- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ ఓ వీకెండ్ ఎమ్మెల్యే
కేటీఆర్ ఓ వీకెండ్ ఎమ్మెల్యే అని, ఆయనకు ప్రజల గురించి మాట్లాడే తీరిక కూడా లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

దిశ, తంగళ్లపల్లి: కేటీఆర్ ఓ వీకెండ్ ఎమ్మెల్యే అని, ఆయనకు ప్రజల గురించి మాట్లాడే తీరిక కూడా లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గురువారం రాత్రి సిరిసిల్లలో పర్యటించిన కవిత, స్థానిక చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే విగ్రహాలకు పూల మాలలు వేసిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సిరిసిల్లలో సెస్ అనే సంస్థ ఉండేదని, దానిని ప్రభుత్వంలో విలీనం చేసినా సరే కేటీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రైతుల కోసం ప్రభుత్వం డిస్కం ఏర్పాటు చేస్తామంటే కూడా నిలదీయలేదని ఫైర్ అయ్యారు. అంటే రైతు డిస్కం కావాలని మీరు భావిస్తున్నారా..? అని నిలదీశారు. సిరిసిల్ల నియోజకవర్గానికి కాళేశ్వరం నుంచి కేవలం 480 ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీ ఎమ్మెల్యే నీళ్లు ఎందుకు తేలేదని నిలదీశారు.
వేములవాడలో ఇంకా 77 వేల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీళ్లు రావాల్సి ఉందన్నారు. వర్కర్ టు ఓనర్ పథకం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. సిరిసిల్లలో కార్మికులు ఉంటే వేమువాడలో యారన్ డిపో పెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. తమ అక్రమ సంపాదన కోసం నెరేళ్లలో దళితులు, బీసీలను ఘోరంగా కొట్టారని విమర్శలు చేశారు. 9 ఏళ్లు అయిన సరే, ఆ బిడ్డలకు న్యాయం జరగలేదని, ఇటీవలే వాళ్లు మమ్మల్ని కలిశారన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా వాళ్లను ఆదుకుంటామని చెప్పి పైసా సాయం చేయలేదని మండిపడ్డారు. మేము అధికారంలోకి వస్తే యువతకు స్వయం ఉపాధి లాంటి గ్రూప్స్ ఏర్పాటు చేసి, వాళ్లకు 2 నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు.






