- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం
మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న చర్యల్లో భాగంగా గోదావరిఖని టూ టౌన్ పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

దిశ, యైటింక్లయిన్ కాలనీ: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న చర్యల్లో భాగంగా గోదావరిఖని టూ టౌన్ పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ ఆదేశాల మేరకు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షిర్కే, తెలంగాణ చౌరస్తా, షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు వివిధ కూడళ్లలో ఉన్న షాపులను నార్కోటిక్ డాగ్ తో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదావరిఖని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎన్. ప్రసాదరావు మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా, కొనుగోలు చేసినా లేదా నిల్వ ఉంచినా సంబంధిత షాపు యజమానులు, వ్యక్తులపై నార్కోటిక్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ తనిఖీల కార్యక్రమంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఎండి అహ్మదుల్లా, హెడ్ కానిస్టేబుల్ ఎండి యాకూబ్, జి. రాజేందర్, ప్రదీప్ రెడ్డి, సాయిచంద్, దేవేందర్, నార్కోటిక్ హెడ్ కానిస్టేబుల్ ఎన్. అంజయ్యతో పాటు డాగ్ హ్యాండ్లర్లు పాల్గొన్నారు.






