- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: బంగారం ధర మరో 40 శాతం పెరుగుతుందా?
2027 చివరి నాటికి మరింత పెరిగి 6,300 డాలర్ల మార్కును తాకుతుందని జేపీ మోర్గాన్ బేస్ అండ్ ప్రీషియస్ మెటల్స్ హెడ్ గ్రెగ్ షీరర్ అభిప్రాయపడ్డారు.

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది ఏకంగా 65 శాతం పెరిగి రికార్డులు సృష్టించిన బంగారం ధరలు, 2026 ప్రథమార్థంలో మాత్రం తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొన్నాయి. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు (క్రూడాయిల్) ధరలు ఆకాశాన్నంటడం బంగారానికి పెద్ద మైనస్‌గా మారింది. చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్లు సుదీర్ఘకాలం పాటు అధికంగానే ఉంటాయనే అంచనాలతో ఫిబ్రవరి నుంచి బంగారం ధరలు సుమారు 20 శాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జే పి మోర్గాన్ మాత్రం పసిడి ఇంకా భారీగా పెరుగుతుందని భావిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి బంగారం సగటు ధర ఔన్సుకు 6,000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. దీని ప్రకారం, మన కరెన్సీలో 10 గ్రాములు మళ్లీ రూ. 2 లక్షలకు చేరనుంది. ఇది ప్రస్తుత ధరల నుంచి సుమారు 40 శాతం ఎక్కువ. అంతేకాకుండా 2027 చివరి నాటికి మరింత పెరిగి 6,300 డాలర్ల మార్కును తాకుతుందని జేపీ మోర్గాన్ బేస్ అండ్ ప్రీషియస్ మెటల్స్ హెడ్ గ్రెగ్ షీరర్ అభిప్రాయపడ్డారు.
గేమ్ ఛేంజర్‌గా 'ఇరాన్ శాంతి ఒప్పందం'
జూన్ 19న జరగబోయే ‘అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం’ ద్వారా ఈ ఏడాది బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తాయని జే పీ మోర్గాన్ భావిస్తోంది. ఇప్పటికే ఈ చారిత్రాత్మక ఒప్పందం వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుస మూడు రోజులుగా ఔన్సుకు 4,300 డాలర్లకు పైన లాభాల్లో పయనిస్తున్నాయి. ఈ ఒప్పందంతో యుద్ధ మేఘాలు తొలగి చమురు ధరలు 4 శాతానికి పైగా పడిపోగా, డాలర్ ఇండెక్స్ కూడా వారం రోజుల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ బలహీనపడటం వల్ల ఇతర దేశాల కొనుగోలుదారులకు బంగారం మరింత చౌకగా మారుతుంది. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం, అమెరికా బడ్జెట్ ఆందోళనలు పసిడికి దీర్ఘకాలంలో ఊతమిస్తాయని జే పి మోర్గాన్ పేర్కొంది.






