- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వియత్నాం To బ్యాంకాక్.. రూ.7 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్, నార్కోటిక్ బ్యూరో అధికారులు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (RGIA)లో కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండ అక్రమరంగా తరలిస్తున్న భారీ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ క్రమంలోనే వియత్నాం (Vietnam) నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి వద్ద జరిపిన తనిఖీల్లో భారీ ఎత్తున లగ్జరీ డ్రగ్స్ లభ్యమయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. వియత్నాం నుంచి వయా బ్యాంకాక్ మీదుగా శంషాబాద్ చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలపై అధికారులకు వచ్చి అతడిని ప్రత్యేకంగా నిలిపివేసి లగేజీని స్కానింగ్ చేయగా, బ్యాగుల్లో దాచి ఉంచిన డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితుడి నుంచి ఏకంగా 7.118 కిలోల ‘హైడ్రోపోనిక్ గంజాయి’ (Hydroponic Weed)ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ డ్రగ్స్ నిందితుడు ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు.. హైదరాబాద్‌లో ఎవరికి సరఫరా చేయాలనుకున్నాడు? నగరంలోని ఏవైనా పబ్‌లు లేదా డ్రగ్స్ పెడ్లర్స్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో అధికారులు నిందితుడిని విచారిస్తున్నారు.






