‘జైబోలో తెలంగాణ’ సినిమా డైరెక్టర్‌ను కలిసిన కేటీఆర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-02 13:07:36  IST  )

జైబోలో తెలంగాణ చిత్ర దర్శకులు ఎన్‌. శంకర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. శంకర్ తల్లి నిమ్మల సక్కుబాయమ్మ గతవారం కన్నుమూశారు.

‘జైబోలో తెలంగాణ’ సినిమా డైరెక్టర్‌ను కలిసిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: జైబోలో తెలంగాణ చిత్ర(Jaibolo Telangana Movie) దర్శకులు ఎన్‌. శంకర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కలిశారు. శంకర్ తల్లి నిమ్మల సక్కుబాయమ్మ గతవారం కన్నుమూశారు. ఇవాళ శంకర్‌ను కలిసి కేటీఆర్ ధైర్యం చెప్పారు. కాగా, నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి గ్రామానికి చెందిన శంకర్(N. Shankar).. 1997లో ‘ఎన్‌కౌంటర్‌’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జైబోలో తెలంగాణ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన జైబోలో తెలంగాణ సినిమా.. అప్పటి తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడిందనే చెప్పాలి. ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నిమ్మల శంకర్‌కు అవార్డు వచ్చిది. ఉత్తమ గాయకుడిగా గద్దర్‌కు అవార్డు లభించింది. ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి. ఇరానీ, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చక్రీ సంగీతం అందించారు.

Next Story