- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. విప్ బీర్ల ఐలయ్య ఫైర్
కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. సీఎం పైన కేటీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడారని, ఆయన తన నోరును అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. సీఎం పైన కేటీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడారని, ఆయన తన నోరును అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. బుధవారం బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ.. "అధికారం పోయినా కేటీఆర్‌కు అహంకారం తగ్గడం లేదు. గత పదేళ్లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్నది ఎవరు?" అని ప్రశ్నించారు.
ముగ్గురు ఎంపీలు, పదిమందికి పైగా ఎమ్మెల్సీలను కొన్నది ఎవరు? పార్టీలకు పార్టీలనే బీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నది ఎవరు? ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? కాళేశ్వరంను ‘కూలేశ్వరం’ చేసిన వారు ఎవరు? ఫార్ములా-ఈ రేస్‌లో అవినీతికి పాల్పడింది ఎవరు? సొంత ఆడబిడ్డను ఇంట్లో నుంచి గెంటివేసింది ఎవరు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అమరవీరుల త్యాగాల పైన భోగాలు అనుభవించింది ఎవరు? అని బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మంచివారని (అచ్చా హై అని) భావించి ప్రజలు అధికారంలోకి తెచ్చారని.. ఇప్పటికైనా అభ్యంతరకర మాటలు ఆపకపోతే తెలంగాణ ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారని ఆయన హితవు పలికారు.






