భ‌యంతో సీఎం పైన కేటీఆర్ నోరు పారేసుకుంటున్నారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

by Malleboina Mahesh |

కేటీఆర్ క‌థ ముగిసింది..సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ప్రజ‌లు ఓడించ‌బోతున్నారు.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కాళ్ల కింద భూమి క‌దిలిపోవ‌డంతో కేటీఆర్ కుత‌కుత ఉడికిపోతున్నాడు.

భ‌యంతో సీఎం పైన కేటీఆర్ నోరు పారేసుకుంటున్నారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ క‌థ ముగిసింది..సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌ను చిత్తు చిత్తుగా ప్రజ‌లు ఓడించ‌బోతున్నారు.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కాళ్ల కింద భూమి క‌దిలిపోవ‌డంతో కేటీఆర్ కుత‌కుత ఉడికిపోతున్నాడు. రాజ‌కీయ భ‌విష్యత్తు గ‌ల్లంతు అవుతుంద‌న్న భ‌యంతో మా సీఎం పైన నోరు పారేసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ అస‌హ‌నంతో నోటికి ఎంత వ‌స్తే అంత మాట్లాడుతున్నాడు..తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంత‌? అమెరికాలో బ‌తికేటోడ‌వి మీ అయ్యను అడ్డం పెట్టుకుని తెలంగాణ‌కు వచ్చారని ఆయన ధ్వజమెత్తారు.

కేకే మ‌హేంద‌ర్ రెడ్డి లాంటి ఉద్యమ‌కారుడి గొంతుకోసి సిరిసిల్ల సీటు సంపాదించిన‌వు..అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప‌దేళ్లు ఎన్నో నీచ‌పు ప‌నులు చేశారని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. పాస్ పోర్టు బ్రోక‌ర్లు ఎవ‌రో తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసు..ప‌దేళ్లు ఎవ‌రు బేకారు ప‌నులు చేశారో చిన్న పిల్లల‌ను అడిగినా చెపుతారన్నారు. కేటీఆర్ నీ భాష మార్చుకోవాలి..సొంత చెల్లెలు మీ ముఖం మీదే ఆరోపణలు చేసినా ఊర్ల వెంట తిరుగుతున్నారని ఎమ్మెల్సీ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ పార్టీని మీరే చంపుకుంటున్నారని వ‌దిలేశాం : అద్దంకి ద‌యాక‌ర్

అయ్య సంపాదించిన డ‌బ్బుల‌తో బ‌జారు గాళ్ల కంటే ఎక్కువ‌ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మీ వ‌ల్లనే మీ అయ్య ఎక్కడికిపోయాడో చూడు..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను వెన‌క్కి లాగింది నువ్వే అని అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇలాంటి మాట‌లు మాట్లాడితే ఉర్కోరు జాగ్రత్త.. నీ పార్టీని ప్రజ‌లు పాతిపెడ‌త‌రు ..తెలంగాణ‌కు ప‌ట్టిన శ‌ని మీరు ..మ‌మ్మల్ని తిట్టడానికి మాకు నోరు రావ‌డం లేదన్నారు. తెలంగాణ మీకు జాగీరా.. మా సీఎం మిమ్మల్నీ ప‌ట్టించుకోవ‌డం లేదు..మీ పార్టీని మీరే చంపుకుంటున్నారని మేమే వ‌దిలేశామని అద్దంకి దయాకర్ చెప్పారు.

Next Story