- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ కీలక భేటీ.. ఫోన్ ట్యాపింగ్, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్, హరీష్‌తో చర్చ!
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ (BRS) కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) భేటీ అయ్యారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)తో పాటు కీలక నేతలతో కేసీఆర్ సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈ భేటీలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు (phone tapping case) విచారణ పురోగతిపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలను, అధికారుల విచారణ తీరును కేసీఆర్ (KCR) అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల (Municipal elections)పై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్తుకు కీలకమని, అందరూ సమన్వయంతో పనిచేసి గెలుపు దిశగా అడుగులు వేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. కాగా వీరి సమావేశానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Harish Rao
- KCR
- KTR






