- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముస్తాబాద్ మండలంలో మూడు కుటుంబాలను పరామర్శించిన కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్, చిప్పలపల్లి, అవునూరు గ్రామాల్లో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు.

దిశ, ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్, చిప్పలపల్లి, అవునూరు గ్రామాల్లో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముందుగా నామాపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ ఎంపీటీసీ జూకంటి సులోచన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్త సుధాకర్‌రావు, కుటుంబ సభ్యులను పరామర్శించి, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తర్వాత చిప్పలపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సర్పంచ్ మాశెట్టి లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లచ్చయ్య అకాల మరణం బాధాకరమని పేర్కొన్న కేటీఆర్, వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అవునూరు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పద్మారెడ్డి సోదరుడు బాల్‌రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






