కేటీఆర్‌ను ఓ ఆట ఆడుకున్న జెన్ జీ యూత్.. ఫన్నీ మూమెంట్స్ వైరల్!

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం జెన్ జీ యువత నిర్వహించిన "ది అండర్ 18 వరల్డ్" ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.

కేటీఆర్‌ను ఓ ఆట ఆడుకున్న జెన్ జీ యూత్.. ఫన్నీ మూమెంట్స్ వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం జెన్ జీ యువత నిర్వహించిన "ది అండర్ 18 వరల్డ్" ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో కలిసి 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడుతూ, చిట్ చాట్ చేస్తూ సరదాగా గడిపారు. జెన్ జీ యూత్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కొన్ని సందర్భాల్లో తలపట్టుకున్నారు. అంతేకాకుండా, హీరో ప్రభాస్‌కు ఫోన్ చేయించడం, యువతతో కలిసి ఆర్మ్ రెజ్లింగ్ ఆడడం, పుషప్స్ తీయడం వంటి సరదా సన్నివేశాలు సమావేశంలో ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ నగరంపై అడిగిన కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ తల పట్టుకోవడం, జెన్ జీలతో నవ్వులు పంచుకుంటూ ఫన్నీగా మాట్లాడడం అక్కడున్న వారిని అలరించింది. ఈ సమావేశానికి సంబంధించిన ప్రోమో టీజర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. కేటీఆర్ సరదా స్వభావం, జెన్ జీ యువతతో ఆయన కలిసిపోయిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పూర్తి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Next Story