- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్ధీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో 15 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.1 కోట్లు!

దిశ, వెబ్ డెస్క్: కలియుగ వైకుంఠం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి (Sarvadarsanam) సుమారు 8 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు కలిగిన భక్తులకు 3 నుండి 4 గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందజేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు నిన్న (మంగళవారం) రోజంతా కలిపి మొత్తం 80,167 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 28,270 మంది భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ద్వారా లభించిన నగదు కానుకల ఆదాయం రూ. 4.1 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.






