పెళ్లిపై భయం.. అయినా అలాంటి మగాడితో బిడ్డను కంటానంటూ ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

తనకు పెళ్లి బంధంపై ఉన్న భయాలు, అలాగే తన ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి ఐశ్వర్య లక్ష్మి మనసు విప్పి మాట్లాడారు.

పెళ్లిపై భయం.. అయినా అలాంటి మగాడితో బిడ్డను కంటానంటూ ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి త్వరలో ‘గట్ట కుస్తీ-2’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది మామన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాను. ఇక ఇప్పుడు సూపర్ హిట్‌గా నిలిచిన ‘గట్ట కుస్తీ’ సీక్వెల్‌తో సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యారు. విష్ణు విశాల్ హీరోగా నటించగా.. చెల్లా అయ్యావు తెరకెక్కించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను జూలై 3న మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ బిజీ అయిపోయిన ఐశ్వర్య లక్ష్మి తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పెళ్లి గురించి చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తనకు పెళ్లి బంధంపై ఉన్న భయాలు, అలాగే తన ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి ఐశ్వర్య లక్ష్మి మనసు విప్పి మాట్లాడారు.

గతంలో తనకు పెళ్లి బంధంలోకి ప్రవేశించడానికి చాలా భయాలు, సమస్యలు ఉండేవి అని ఆమె చెప్పారు. అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధత ఉండేదని, కానీ ఈ ‘గట్ట కుస్తీ-2’ సినిమా షూటింగ్ సమయంలో ఒక చిన్నారితో గడిపే అవకాశం వచ్చిందని వెల్లడించారు. ఆ పాపకు దగ్గరైనప్పుడు తనలోని మాతృత్వపు భావాలు ఒక్కసారిగా మేల్కొన్నాయని, ఒక బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక తనలో కలిగిందని ఆమె వివరించారు. తనకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై స్పందిస్తూ.. భవిష్యత్తులో తనకంటూ ఒక బిడ్డను కనాలనుకుంటున్నట్లు ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. అయితే, కనీసం తన పిల్లలకు ఒక మంచి తండ్రి అవుతాడని తాను నమ్మే వ్యక్తి, అలాగే ఏ కష్టం వచ్చినా తనను వదిలి పారిపోని ఒక తోడు కావాలని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి దొరికినప్పుడే తాను ఈ బంధాన్ని స్వీకరిస్తానని స్పష్టం చేశారు. పెళ్లి, జీవిత భాగస్వామిపై ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story