స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన రియా శింబు.. కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్!

by Mallepaka Hamsa |

రియా శింబు కోలీవుడ్‌లో మరో లక్కీ ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్ . టాలెంటెడ్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న సరికొత్త చిత్రంలో రియా శింబు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన రియా శింబు.. కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రియా శింబు తమిళ, మలయాళ చిత్రాలతో నటిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. ‘కప్’ మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చన ఆమె ‘సర్వం మాయ’ సినిమాతో ఫుల్ ఫేమ్ రాబట్టుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఊహించని క్రేజ్ రాబట్టుకున్న రియా ప్రస్తుతం తమిళంలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన చియాన్-63 ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శకుడు ఆనంద శంకర్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 60 ఏళ్ల విక్రమ్‌తో 21ఏళ్లున్న రియా శింబు రొమాన్స్ చేస్తుండటం విశేషం. చియాన్ విక్రమ్ సినిమాతో పాటు, తాజాగా రియా శింబు కోలీవుడ్‌లో మరో లక్కీ ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్ . టాలెంటెడ్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న సరికొత్త చిత్రంలో రియా శింబు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రసిద్ధ దర్శకురాలు కిరుత్తిగ ఉదయనిధి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా ప్రారంభం కాగా.. మరో వారం రోజుల పాటు నిర్విరామంగా కొనసాగించి ముఖ్యమైన సీన్స్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. మానవ సంబంధాల మధ్య ఉండే సంక్లిష్టమైన భావోద్వేగాలను, పాత్రల మధ్య కెమిస్ట్రీని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకురాలు కిరుత్తిగ ఉదయనిధికి మంచి పేరుంది. అందువల్ల, విజయ్ సేతుపతి, రియా శింబు కాంబినేషన్‌లో ఆమె నుండి ఒక మంచి ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ డ్రామా రాబోతున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ స్టూడియోస్ భారీ నిర్మాణ విలువలతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story