- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్నిస్తే క్రిమినల్స్‌కు సపోర్ట్ చేస్తారా అంటున్నారు: జగన్
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పోయి రూల్ ఆఫ్ ఫియర్ వచ్చిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కూటమి రాకముందు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై చర్చ జరిగేదని వైసీపీ హయాంలో ఎన్నో సంస్కరణలపై చర్చ జరిగిందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పోయి రూల్ ఆఫ్ ఫియర్ వచ్చిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కూటమి రాకముందు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై చర్చ జరిగేదని వైసీపీ హయాంలో ఎన్నో సంస్కరణలపై చర్చ జరిగిందన్నారు. చంద్రబాబు వచ్చిన తరవాత లాకప్ డెత్, రెడ్ బుక్ రాజ్యాంగంపై చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తే అణచివేసేలా మార్చారని విమర్శించారు. జర్నలిస్టులు సహా ఎవరు ప్రశ్నించినా అణచివేస్తున్నారని అన్నారు. చట్టాన్ని, పోలీసు వ్యవస్థను చంద్రబాబు తన గుప్పిట్లో పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
ఎవరూ ఏం చేయలేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కస్టడీలోనే సాయికృష్ణను చంపి మృతదేహం కూడా మాయం చేశారని ఆరోపించారు. కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికి ఆమడ దూరంలోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. సాయికృష్ణ తల్లి కన్నీటికి విలువ లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు నెవ్వెరపోయే ఘటనలు జరుగుతున్నాయని, చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదట అని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ఎల్లో మీడియాతో వ్యక్తిత్వ హననం చేయిస్తారని, క్రిమినల్స్‌కు మద్దతిస్తారా అంటూ ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు.






