- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబ్లీ గేట్ల ఎత్తివేత...
బాబ్లీ ప్రాజెక్టుగేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు14 గేట్లను బుధవారం రోజున అధికారులు ఎత్తివేశారు.

దిశ, మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్ర ధర్మభాద్ తాలుకలో మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుగేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు14గేట్లను బుధవారం రోజున అధికారులు ఎత్తివేశారు. ఈ గేట్లను జులై 1 నుండి అక్టోబర్ 28 వరకు నాలుగు నెలల పాటు ఎత్తివేసి ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి బాబ్లీ ప్రాజెక్ట్, ఎస్సార్ ఎస్పీ ప్రాజెక్ట్ ల అధికారులు, సీడబ్ల్యూసీ అధికారులు, ఎగ్జిక్యూజిటివ్ ఇంజనీర్ చరణ్, జూనియర్ ఇంజనీర్ సాయి ప్రణీత్, సాయి ప్రకాష్ లు మహారాష్ట్ర తరుపున ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ సీ ఆర్ బాన్సోడ్, సీడీ పొట్టర్ సబ్ డివిజనల్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ డి. గౌరవ్, తెలంగాణ తరఫున ఎస్సారెస్పీ అధికారులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్‌లు కొత్త రవి, శ్యాం కుమార్, విన్యాస్ రెడ్డి లు పాల్గొని నీటిని కిందకు వదిలారు.






