- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తిచేస్తామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

దిశ, షాద్ నగర్: గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తిచేస్తామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 5 లక్షల భయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి..
రైతుల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ఒకే చోటసేవలను అందించేందుకు రైతు సేవ కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహద పడతాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని ఓటు అని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరూ జాబితాలో తమ ఓటు ఉందో లేదో ఎస్ఐఆర్ ప్రక్రియలో పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






