- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి.. మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి పై షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, షాద్‌నగర్ : ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి పై షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో ప్రజాసమస్యల పై అధికారులతో మాట్లాడేందుకు బుధవారం ఉదయం 11 గంటలకు మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళ్లారు. అయితే ఆయన వెళ్లిన సమయంలో కార్యాలయంలో ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది కూడా లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని చెరువులు, కాలువలు, జలవనరుల ఆక్రమణల అంశం పై అధికారులతో చర్చించేందుకు వస్తే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
ఈ విషయమై సంబంధిత అధికారిని మాజీ ఎమ్మెల్యే ఫోన్‌లో సంప్రదించగా, ఆ అధికారి నిర్లక్ష్యంగా స్పందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించకపోతే ప్రజలకు సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. ప్రధాన అధికారులే సమయానికి కార్యాలయానికి రాకపోతే, కిందిస్థాయి సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలు తమసమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తుంటే అధికారులు అందుబాటులో లేకపోవడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని బక్కని నరసింహులు డిమాండ్ చేశారు.






