- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్న రావణ్ అరెస్ట్..? పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను పిఠాపురం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దిశ, కాకినాడ / పిఠాపురం: ప్రశ్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో ప్రశ్న రావణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‍లపై తీవ్ర పదజాలంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారు. రావణ్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగులను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్‍గా ఉన్న జనసేన నాయకుడు బొజ్జ రామ్ కుమార్ లిఖితపూర్వకంగా పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసిన రావణ్‍పైన, ఆ వ్యాఖ్యల క్లిప్పింగులను వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బొజ్జ రామ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రావణ్ ను హైదరాబాదులో అదుపులోకి తీసుకుని పిఠాపురం తీసుకువచ్చారు. ప్రస్తుతం రావణ్ పోలీసులు అదుపులో విచారణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.
రావణ్‍పై నమోదైన సెక్షన్లు ఇవే!
బీఎన్ఎస్ 196, 352, 356(2), 356(3), 111 లతోపాటు ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రావణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ పెద్ద హడావుడి:
రావణ్ పిఠాపురం పోలీస్ స్టేషన్‍లో ఉన్నాడని సమాచారం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు ఒక్కొక్కరుగా పిఠాపురం పోలీస్ స్టేషన్‍కు చేరుకుంటున్నారు. రావణ్‍కు మద్దతు ఇచ్చేందుకు దళిత నేతలు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో అక్కడ హడావుడి నెలకొంది. ఈ సందర్భంగా జై భీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జున రావు పిఠాపురం పట్టణ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేత పాలనపై ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. నిరంకుశత్వ విధానంతో కూటమి ఉందన్నారు.రావణ్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని మల్లికార్జున రావు డిమాండ్ చేశారు.కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.






