భూకంప శిథిలాల కింద 80 ఏళ్ల బామ్మను కాపాడిన ఇండియన్ ఆర్మీ

by Muthe.Rajitha |

ఇటీవల జూన్ 24న వెనుజులాను రెండు వరుస భారీ భూకంపాలను వణికించిన సంగతి తెలిసిందే.

భూకంప శిథిలాల కింద 80 ఏళ్ల బామ్మను కాపాడిన ఇండియన్ ఆర్మీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల జూన్ 24న వెనుజులాను రెండు వరుస భారీ భూకంపాలను వణికించిన సంగతి తెలిసిందే. కాగా భూకంపాల ధాటికి వందలాది నిర్మాణాలు కుప్పకూలగా.. అంతర్జాతీయ దేశాల సహకారంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా ఓ మూడేళ్ల బాలుడు ఆరు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన సంఘటన మరువక ముందే.. తాజాగా 79 ఏళ్ల వృద్ధురాలు మృత్యువును జయించి క్షేమంగా శిథిలాల నుంచి భారత సైన్యం (Indian Army) అత్యంత సాహసోపేతంగా కాపాడింది. కూలిపోయిన భారీ కాంక్రీట్ కట్టడాల మధ్య నలిగిపోతూ, చావు అంచుల్లో ఉన్న వృద్ధురాలిని భారత జవాన్లు క్షేమంగా వెలికితీశారు. భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆ వృద్ధురాలి కాలు తీవ్రంగా విరిగింది. దీనికి తోడు ఆహారం, నీరు అందకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. కదలలేని స్థితిలో, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిన తరుణంలో భారత ఆర్మీ రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి అత్యంత జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చాయి. శిథిలాల నుంచి రక్షించిన వెంటనే అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ (Indian Army Field Hospital) కు ఆమెను తరలించారు. ప్రస్తుతం భారత మిలిటరీ వైద్య నిపుణుల బృందం ఆమెకు అత్యంత అధునాతన అత్యవసర వైద్య సేవలను అందిస్తోంది.

Next Story