అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్ల వినతి

by Kodari Anjali |

నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్ల వినతి
X

దిశ, కామారెడ్డి టౌన్: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. డివియేషన్ లేకుండా, సెల్లార్ అనుమతి, పార్కింగ్ సదుపాయం లేకుండా, నాలాపై భవనాలు నిర్మిస్తున్నారని, కొందరు అధికారుల సహకారంతో ఇవి జరుగుతున్నాయని కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమ కట్టడాలపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Next Story