- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
by Kodari Anjali |
కంటైనర్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై జరిగింది.

X
దిశ, వేములపల్లి: కంటైనర్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన పోతనబోయిన వంశీ (22) ద్విచక్ర వాహనంపై నల్గొండ వైపు వెళుతుండగా.. మిర్యాలగూడ నుండి నల్గొండ వైపు వెళ్తున్న కంటైనర్ వెనకనుంచి ఢీ కొట్టింది. దీంతో తలపై నుంచి కంటైనర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story






