అన్నట్టుగానే.. విద్యార్థులకు రూ.1000 నజరానా..!

by Batti.Sumithra |

ఇటీవల భైంసా మండలం లింగా గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి, పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నెలకు రూ.1000 ప్రకటించిన విషయం తెలిసిందే.

అన్నట్టుగానే.. విద్యార్థులకు రూ.1000 నజరానా..!
X

దిశ, భైంసా : ఇటీవల భైంసా మండలం లింగా గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి, పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నెలకు రూ.1000 ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఈరోజు జూలై ఫస్ట్ కావడంతో పాఠశాలలో చేరిన విద్యార్థులకు గ్రామసర్పంచ్ సుష్మారాణి, ఉపసర్పంచ్ శంకర్, విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో రూ.1000 ని అందించారు. అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి బ్యాగ్స్, బుక్స్, పెన్నులను అందించారు. విద్యార్థులకి అందిన నజరానాతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది గమనించిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని సైతం పాఠశాలకు పంపె యోచనతో ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Next Story