నా పోరాటం పేదరికానికి వ్యతిరేకంగానే.. : ఎమ్మెల్యే కూనంనేని

by Taduka Kalyani |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలమయ్యాయని , నా కోపం, తాపం పేదరికానికి వ్యతిరేకంగానే నని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

నా పోరాటం పేదరికానికి వ్యతిరేకంగానే.. :  ఎమ్మెల్యే కూనంనేని
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలమయ్యాయని , నా కోపం, తాపం పేదరికానికి వ్యతిరేకంగానే నని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పేదల కోసం పని చేసేది ఎర్ర జెండా మాత్రమేనని, పేద ప్రజల కనీస వసతులైన ఇల్లు, ఇండ్ల స్థలం కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక మంది పేదలు ఉన్నారని, ఇల్లు లేని వారు , ఇండ్ల స్థలం లేనివారు వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, కొత్తగూడెం పట్టణంలో నిలిపివేసిన ఇంటి క్రమబద్ధీకరణ పట్టాల 76 జీ ఓ ను పునరుద్ధరించి ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని , కొత్తగా నిర్మించుకున్న ఇండ్లకు పేర్లతో ఇంటి నెంబర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల సమస్యల పై ఇక నుంచి దశల వారి పోరాటాలు, ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. పాల్వంచ పట్టణ పరిధిలోని 444, 999, 817, 727,410 సర్వే నంబర్లలో నిర్మించుకున్న ఇండ్లకు క్రమబద్ధీకరించి ఇంటి పట్టాలు మంజూరు చేయాలన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని, పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేత చర్యలు మానుకోవాలన్నారు. కేంద్రం ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాలను కొలుస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని, సర్ పేరు తో ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టిందని ఆరోపించారు. వామపక్ష పార్టీల అధ్వర్యంలో ఈ నెల 6న హైదరాబాద్ లో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్పోరేషన్ మేయర్ మూడ్ గణేష్, మున్సిపల్ కార్పొరేటర్లు, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శులు సాబిర్ పాషా, మెచ్చ వెంకటేశ్వర్లు, గౌనీ నాగేశ్వరరావు, నాయకులు ముత్యాల విశ్వనాధం, అన్నవరపు కనకయ్య, సాయిబాబు, తుపాకుల నాగేశ్వరరావు, ఆదిలక్ష్మి, సతీష్, సంజీవ్, రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story