- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ప్రాజెక్ట్ నా కెరీర్‌లో చాలా స్పెషల్.. ‘స్పిరిట్’పై అంచనాలను పెంచేసిన త్రిప్తి డిమ్రి
సమయం ఆసన్నమైనప్పుడు థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్ అండ్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుందని, వారు దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తృప్తి దిమ్రి వెల్లడించారు.

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో ప్రభాస్ సరసన ముందుకు దీపికా పదుకొణెను హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పటికీ.. పలు కారణాల వల్ల ఆమెను తొలగించి త్రిప్తిని ఫైనల్ చేశారు. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. తాను ఈ సినిమా విషయంలో చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నానని చెప్పారు. ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక విభిన్నమైన, చాలా ప్రత్యేకమైన అనుభవంగా నిలవబోతోందని అన్నారు.
అయితే సినిమాకు సంబంధించిన మరిన్ని ముఖ్యమైన వివరాలను షేర్ చేయడానికి ఇది సరైన సమయం కాదని, ఇప్పుడే అన్ని విషయాలు చెప్పడం చాలా తొందరపాటు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సరైన సమయం వచ్చినప్పుడు మేకర్స్ అన్ని వివరాలు వెల్లడిస్తారని, అప్పటివరకు ప్రేక్షకులు ఓపికగా ఉండాలని కోరారు. చివరగా, సమయం ఆసన్నమైనప్పుడు థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్ అండ్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుందని, వారు దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తృప్తి దిమ్రి వెల్లడించారు. ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తృప్తి, ఇప్పుడు మళ్లీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే ప్రభాస్ సరసన నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం తృప్తి దిమ్రి మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.






