- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వింటారా సరదాగా’ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

దిశ, సినిమా: అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాు సితార ఎంటర్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి్స్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ మూవీ మ్యూజికల్ జర్నీని మేకర్స్ ఎప్పుడో గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన మొదటి పాట నెటిజన్లను విశేషంగా అలరించడమే కాకుండా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుని ట్రెండింగ్‌లో నిలిచింది.
తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘చింగారి’ అని సాగే ఈ సరికొత్త పాటను జులై 2వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. టాలెంటెడ్ సింగర్స్ సిద్ శ్రీరామ్, లిప్సికా కలిసి పాడిన ఈ మెలోడీ సాంగ్, వినే ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. ఈ అప్‌డేట్‌తో పాటు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, హీరో అశోక్ గల్లాను ఎంతో ప్రేమగా హగ్ చేసుకుని, ముఖంలో ఎంతో ఆనందంతో నవ్వుతూ కనిపించారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, సిద్ శ్రీరామ్ వాయిస్ తోడవడంతో ఈ ‘చింగారి’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.






