చరిత్ర పుటల్లోకి ఉపాధి హామీ పథకం.. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 'జీ రామ్ జీ' చట్టం

by Prasad Jukanti |

ఉపాధి హామీ (MGNREGA) స్థానంలో కొత్తగా 'VB-G-RAM G' చట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై 125 రోజుల పనితో పాటు రూ. 300 కనీస వేతనం లభించనుంది.

చరిత్ర పుటల్లోకి ఉపాధి హామీ పథకం.. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీ రామ్ జీ చట్టం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెను సంచలనం సృష్టించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కాలగర్భంలో కలిసిపోయింది. నరేగా స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్, అజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G-RAM G)' చట్టం ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న ఉపాధి హామీలో ప్రతి కూలీకి 100 రోజుల పని దినాలు ఉండగా, కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఇకపై గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల ఉపాధి హామీతో పాటు రోజూ వారీ కనీస వేతనం రూ.300 గా ఖరారు చేశారు. గతంలో 263 రకాల పనులకు మాత్రమే అనుమతి ఉండగా ఈ నూతన పథకంలో ఆ సంఖ్యను 318కి పెంచారు. అలాగే గతంలో నరేగా కోసం కేంద్రం 100 శాతం నిధులు కేటాయిస్తుంటే ప్రస్తుత మార్పుల వల్ల కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతుందని పలు రాష్ట్రాలు ఈ కొత్త చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

పలు రాష్ట్రాలు అభ్యంతరం:

కేంద్రం తీసుకువచ్చిన ఈ'వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్' పథకంపై తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం సైతం చేసింది. ఈ పథకంలో చేరాలా వద్దా అనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ప్రభుత్వం రేపు (జులై 2)న జరగబోయే రాష్ట్ర కేబినెట్ లో సమగ్రంచా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది.

Next Story