- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు.. నితిన్ నబీన్‍కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
తెలంగాణలో బీజేపీ పార్టీ అవసరం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీకి తెలంగాణలో అవకాశం లేదని ఆ పార్టీ అవసరం ఇక్కడ లేదన్నారు. మూడు రోజుల పర్యటనలో నితిన్ నబీన్ ఏం చేశారు? రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పరిస్థితుల మీద, కుల సమీకరణలు, ఉద్యమం మీద ఆయనకు అవగాహన ఉందా? అని నిలదీశారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
ఎంత రెచ్చగొట్టినా ఎలాంటి ఢోకా లేదు:
సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారం అయిందని వేల మంది ప్రాణ త్యాగం వల్ల రాష్ట్రం సాకారం అయిందని చెప్పారు. నిన్నే సీఎం రేవంత్ రైతు భరోసా విడుదల చేశారని తెలంగాణ ప్రజలా గుండెల్లో కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఉండిపోతుందన్నారు. బీజేపీ చెబుతున్న వికసిత్ భారత్‍లో తెలంగాణ లేదా? రెండు కోట్ల ఉద్యోగాలు పేరిట మోసం చేయలేదా? అని నిలదీశారు. సంపన్న వర్గం కోసమే కేంద్రం పని చేస్తోందని అయోధ్య దోపిడి గురించి, కాళేశ్వరం స్కామ్ పై సీబీఐ దర్యాప్తు పై నబీన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణలో మత వైషమ్యాలకు తావులేదని మత చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే సాధ్యం కాదన్నారు. మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ అన్నారు. బీహార్‍లో ఓటు దొంగిలిస్తే మీనాక్షి నటరాజన్ విషయంలో ఏకంగా సీటు చోరీ చేశారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సర్ కార్యక్రమం ఓట్ల జత కోసం అయితే అది కాస్త ఇపుడు ఓట్ల తొలగింపు కార్యక్రమంలా మారిందన్నారు. సీబీఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్‍ను గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ అనుబంధ సంస్థలా వాడుకుంటున్నారని ఎలక్షన్ కమిషన్ చేతిలోకి తీసుకోని రాజ్యంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. విభజన హామీలు నెరవేస్తారని, సందేశం ఇస్తారని ఆశిస్తే విష బీజం వేశారని బీజేపీ ముసుగులో ఇతర పార్టీలు రెచ్చగొట్టినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డొకా లేదన్నారు.
టెంపరరీ గోల్స్ మాత్రమే రీచ్:
కేసీఆర్‍కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్‍కు పరిమితం అయ్యారని బావ, బామ్మర్దలు మాపై విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా పార్టీ వైపు ఉన్నారని, మా ప్రభుత్వం వచ్చాక 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. జాతీయ అధ్యక్షుడు వస్తె పట్టుమని 2 వేల మందిని కూడా పోగు చేసుకోలేని పార్టీ బీజేపీ అన్నారు. పేద ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదు 90 శాతం ప్రతిపక్ష నాయకుల మీద ED, దాడులు చేయించారు. సీబీఐ, ఈడీలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ నాయకులు టెంపరరీ గోల్స్ మాత్రమే రీచ్ అవుతారని బీజేపీతో పాటు ఎన్ని పార్టీలు కలసి పోటీ చేసిన కాంగ్రెస్‍ను ఢీ కొట్టలేరని ధీమా వ్యక్తం చేశారు.






