- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమయపాలన పాటించని పల్లె దవాఖాన సిబ్బంది..!
by Kodari Anjali |
పాండ్యా నాయక్ తండాలోని పల్లెదవాఖానలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు.

X
దిశ, చివ్వేంల: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లె దవాఖానాలను ఏర్పాటు చేశాయి. కానీ మండల పరిధిలోని పాండ్యా నాయక్ తండాలోని పల్లెదవాఖానలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు దిశ ప్రతినిధి సందర్శించగా.. దవాఖానకు తాళాలు వేసి ఉన్నాయి. సంబంధించిన వైద్యాధికారుల పర్యవేక్షణ లేకనే సిబ్బంది చుట్టం చూపులా వచ్చామా.. పోయామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పల్లె దవాఖానపై పర్యవేక్షణ చేసి సిబ్బంది సమయ పాలన పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
Next Story






