- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్కగా భూ హక్కుల రీసర్వే..
పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

దిశ, శివంపేట: పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం శివంపేట మండలంలోని బీక్యాతాండలో భూభారతి భూముల రీసర్వే గ్రామసభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో, ఎడీ సర్వే, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, గ్రామ సర్పంచ్ విజయ్ నాయక్‌తో కలిసి పాల్గొన్నరు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. శివంపేట మండలం1946 సంవత్సరంలో రీసర్వే అయిందని, అప్పటి నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. భూమి క్రయవిక్రయాల్లో మ్యాపులను కూడా అప్డేట్ చేయాలన్నారు. గ్రామాల్లో భూ నక్షల్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భూరీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొందపరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి, భూమికి భూధార్‌ను అందిస్తామన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. శాశ్వతంగా భూసమస్యల పరిష్కారం కోసమే భూ రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి కిషన్, రైతులు పాల్గొన్నారు.






