వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ

by Kodari Anjali |

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత బుధవారం బాధ్యతలు చేపట్టారు.

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ
X

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కమిషనర్‌గా విధులు నిర్వహించిన సన్ ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికారులు నూతన కమిషనర్‌కు స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడంపై ఆమె దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

Next Story