- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి..
by Kodari Anjali |
రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ కృష్ణ, సబ్ ఇన్స్ పెక్టర్ అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

X
దిశ, కౌడిపల్లి: రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ కృష్ణ, సబ్ ఇన్స్ పెక్టర్ అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని శేరితండాలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజంలో ప్రతి ఒక్కరు సమానమేనని పౌరుల హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో అక్కడక్కడా అగుపిస్తున్న కులవివక్ష, అంటరానితనం అనే దురాచారాలను పారదోలాలని అధికారులు పేర్కొన్నారు. మూఢనమ్మకాలు వీడాలని అవగాహన కల్పించడంతోపాటు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణేష్, ఉప సర్పంచ్ మురహరి, పంచాయతీ కార్యదర్శి సిరాజుద్దీన్, ఆర్ఐ ఫైసల్, తండావాసులు పాల్గొన్నారు.
Next Story






