బస్సులో సీట్ పంచాయతీ.. డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కే !

by Batti.Sumithra |

ఆర్టీసీ బస్సుల్లో సీట్ల పంచాయతీ తరుచూ చూస్తూనే ఉంటాం.

బస్సులో సీట్ పంచాయతీ.. డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కే !
X

దిశ, నర్సాపూర్ : ఆర్టీసీ బస్సుల్లో సీట్ల పంచాయతీ తరుచూ చూస్తూనే ఉంటాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బస్సు సీటు పంచాయతీ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. వివరాల్లోకి వెళితే బుధవారం మెదక్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ బస్ స్టాప్ లో ఆగింది. అటువైపుగా ప్రయాణించే వాహనదారులు బస్సులో ఎక్కారు. బస్సులో ఎక్కిన మానసిక వికలాంగుడైన వినోద్ అనే వ్యక్తి సీటు విషయంలో ఓ మహిళ పై దాడి చేసి బ్యాగు చింపి వేయడంతో గొడవ తీవ్ర స్థాయికి చేరింది. బస్సులో మిగతా ప్రయాణికులు ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవను మరింతగా పెంచారు. ఇక చేసేది లేక బస్సు డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ముందు నిలిపాడు. గొడవపడ్డ వ్యక్తులు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు. ఈ గొడవతో మిగతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Next Story